రాజు సుందరం కొరియోగ్రఫీలో డాన్సు చేయనున్న స్టైలిష్ స్టార్

రాజు సుందరం కొరియోగ్రఫీలో డాన్సు చేయనున్న స్టైలిష్ స్టార్

Published on Apr 25, 2012 8:20 AM IST


తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ డాన్సర్స్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. సరైన పాట అందుకు తగ్గ కొరియోగ్రాఫర్ దొరికితే డాన్సులు అదరగొడతాడు. అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న ‘జులాయి’ సినిమాలోని ఒక పాటకి ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం ఆధ్వర్యంలో చిత్రీకరించనున్నారు. ఈ నెల 27 నుంచి 30 వరకు దుబాయ్ లో ఈ పాట చిత్రీకరించనున్నారు. ఈ పాట కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న అల్లు అర్జున్, రాజు సుందరం తో కలిసి ప్రాక్టీసు కూడా చేసాడని సమాచారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర ఆడియో ఈ నెల 27న విడుదల కాబోతుందని సమాచారం. ఎన్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య సమర్పిస్తున్నారు.

తాజా వార్తలు