స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, శృతి హాసన్ హేరో హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ‘రేస్ గుర్రం’. ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్ మిలాన్ లో జరుగుతోంది. ఈ సినిమాకి సంబందించిన యూరోపియన్ షెడ్యూల్ కొద్ది రోజుల క్రితం జెనీవాలో ప్రారంభమైంది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా యాక్షన్ కలగలిపిన రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. ఈ సినిమా స్క్రీన్ ప్లే లో ఎవరూ ఊహించని విధంగా ఎక్కువగా ట్విస్ట్ లు ఉంటాయని సమాచారం. వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమాని నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్నాడు.