సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ పని చేసిన లేటెస్ట్ చిత్రం “అల వైకుంఠపురములో” బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో ఒక లిరిక్ ఉంటుంది, “బన్నీ అడుగు పడ రికార్డులు అదిరిపడ” అని. ఇప్పుడు ఈ లిరిక్స్ ను ఈ సినిమా ద్వారానే బన్నీ నిజం చేసి చూపించాడు. తన రికార్డుల పరంపర ఈ చిత్రం విడుదల కాక ముందు నుంచే మొదలయ్యింది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ క్లీన్ ఫ్యామిలి ఎంటర్టైనర్ “అల వైకుంఠపురములో” ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలయ్యి ఏ కేటగిరీని కూడా వదలకుండా అన్నిటిలోను ఆల్ టైం రికార్డులు నెలకొల్పింది. అలాగే బాక్సాఫీస్ దగ్గర అయితే పలు చోట్ల బాహుబలి రికార్డులు కూడా బద్దలయ్యాయి.
ఇలా ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలోనే కనీ వినీ ఎరుగని ఆల్ టైం టీఆర్పీ రికార్డును నెలకొల్పింది. గత రెండు వారల కితం జెమినీ ఛానెల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ కాబడిన ఈ చిత్రం ఏకంగా 29.4 టీఆర్పీ రేటింగ్ సంపాదించి స్మాల్ స్క్రీన్ పై సునామి రేపింది. ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా సుశాంత్ మరియు నివేత పెత్తురాజ్ లు మరో ప్రధాన పాత్రల్లో కనిపించారు.