డాన్సుల్లో నాకంటే అల్లు అర్జున్ బెస్ట్: రామ్ చరణ్


మెగా పవర్ స్టార్ నటిస్తున్న ‘రచ్చ’ చిత్రం ఏప్రిల్ మొదటి వారంలో విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలోని సెవన్ ఎకర్స్ లో ‘డిల్లకు డిల్లకు’ పాట చిత్రీకరణ జరుగుతోంది. రేపు రామ్ చరణ్ పుట్టిన రోజు ఉండగా రచ్చ సినిమాలోని ‘సింగరేనుంది’ పాట పొల్లాచ్చిలో చిత్రీకరించాలని నిర్ణయించారు. మెగా అభిమానుల కోసం ఆయన తన పుట్టిన రోజుని పాత్రికేయుల ముందు జరుపుకొన్నారు. రామ్ చరణ్ మాట్లాడుతూ రచ్చ నా కెరీర్లోనే ఇది బెస్ట్ చిత్రం అవుతుంది. నేను ఇప్పటివరకు అన్ని కమర్షియల్ సినిమాలే చేశాను. ఇది కూడా వెరైటీ కమర్షియల్ చిత్రంగా ఉంటుంది. సంపత్ నంది టేకింగ్ విభిన్న శైలిలో ఉంటుంది. అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ ఈ ఇద్దరిలో డాన్సుల్లో ఎవరు బెస్ట్ అని తమన్నాని అడగగా చరణ్ మధ్యలో జోక్యం చేసుకొని తనకంటే అల్లు అర్జున్ బెస్ట్ డాన్సర్ అని అన్నాడు.

Exit mobile version