స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా త్వరలో విడుదల కావడానికి సిద్దమవుతోంది. ఈ సినిమా పై అల్లు అర్జున్ భారీగానే అంచనాలు పెట్టుకున్నాడు. హీరోకి సంబందించిన వర్గాలు చెబుతున్న దాని ప్రకారం బన్ని ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ విషయంలో చాలా ఆసక్తిగా ఉన్నాడని సమాచారం.
ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ ని థాయ్ ఫైట్ మాస్టర్ కేచ చాలా స్టైలిష్ గా, చాలా ఫ్రెష్ గా ఉండేలా కంపోజ్ చేసాడు. కేచ పనితనానికి ముగ్దులైన అల్లు అర్జున్ మరియు ప్రొడక్షన్ టీం ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ స్పెషల్ హైలైట్ అవుతాయని అంచనా వేస్తున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. అమలా పాల్, కేథరిన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. బన్ని కేచ పైన పెట్టుకున్న నమ్మకం వర్క్ అవుట్ అవుతుందా? అనేది సినిమా విడుదలైన తర్వాతే చెప్పాలి.