ఆగష్టు 2వ వారంలో మూవీస్ ఫెస్టివల్

ఆగష్టు 2వ వారంలో మూవీస్ ఫెస్టివల్

Published on Jul 23, 2013 4:38 PM IST

2013-Release-movies
సినిమా ప్రేక్షకులకు ఆగష్టు రెండవ వారం మూవీ ఫెస్టివల్ బొనంజా కానుంది. ఈ వారంలో మూడు పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. మొదటిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా ఆగష్టు 7న విడుదలకానుంది. ఆ తరువాత ఆగష్టు 8న షారుక్ ఖాన్ నటించిన ‘చెన్నై ఎక్స్ ప్రెస్ ‘ సినిమా విడుదల కానుంది. అలాగే ఆగష్టు 9న తమిళ హీరో విజయ్ నటించిన ‘తలైవ’ సినిమా విడుదలకు సిద్దమవుతోంది.
‘అత్తారింటికి దారేది’, ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ సినిమాలు ఆంద్ర ప్రదేశ్ లో మంచి ఓపెనింగ్ ని నమోదు చేస్తాయని, అలాగే తమిళనాడులో ‘తలైవ’ కూడా భారి కలెక్షన్స్ వసూలు చేస్తుందని అంచనాలు వున్నాయి. ఈ మూడు సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని సాదిస్తాయని అందరు భావిస్తున్నారు. ఇది నిజంగా దక్షిణ భారత దేశ సినిమా ప్రియులకు అద్బుతమైన వారం.

ఆగష్టు 8న ఈద్ అల్ – ఫితర్ పండగ సందర్భంగా ఈ సినిమాలకు భారీగా కలెక్షన్స్ వస్తాయని బావిస్తున్నారు.

తాజా వార్తలు