ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా బడ్జెట్ ?

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా బడ్జెట్ ?

Published on May 9, 2020 5:30 PM IST


యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ఓ భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కించనున్నాడని, ఎన్టీఆర్ పుట్టినరోజు స్పెషల్‌ గా మే 20న ఈ సినిమాని అధికారికంగా ప్రకటించనున్నారని చర్చ నడుస్తోన్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఆసక్తికరమైన గాసిప్ ఏమిటంటే ఈ చిత్రం పాన్ – ఇండియా స్థాయి 150 కోట్ల బడ్జెట్లో నిర్మించబడుతుందట. ఇక ఈ సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపు బల్క్ డేట్స్ కేటాయిస్తున్నారట. 2021 చివర్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2023 తరువాత ప్రేక్షకుల ముందుకు రానుందని వినిపిస్తుంది.

కేజీఎఫ్ చాప్టర్- 1 ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 250 కోట్ల‌ వసూళ్లు సాధించింది. దాంతో ప్రశాంత్ నీల్ కి మంచి డిమాండ్ ఏర్పడింది. ఏది ఏమైనా ‘కె.జి.ఎఫ్ 2’ను పూర్తి చేసి ప్రశాంత్ తెలుగు సినిమా మొదలుపెట్టనున్నాడు. ఇక కేజీఎఫ్ విషయానికి వస్తే.. ద‌శాబ్ధాల క్రితం కోలార్ బంగారు గ‌నుల్లో మాఫియా క‌థతో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు