చిత్ర పరిశ్రమకు ఇది చాలా విశాదకరమయిన వారంగా మారుతుంది మాకు ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం శుభ పుతేల జాండీస్ మూలాన మరణించారు. ఈరోజు సాయంత్రం ఈ నటి మరణించినట్టు తెలుస్తుంది. కొంతకాలం క్రితం ఈ నటి రామ్ మరియు బొమ్మరిల్లు భాస్కర్ చిత్రంలో కొద్ది రోజులు నటించింది కాని అనారోగ్యం కాణంగా ఆ చిత్రం నుండి తప్పుకుంది. తమిళంలో ఈ ఏడాది విడుదలయిన “మలై పోళుదిన్ మైకత్తిలే” అనే చిత్రంలో శుభ పుతేల కనిపించారు.2010లో శుభ పుతేల మిస్ సౌత్ ఇండియా టైటిల్ ని గెలుచుకుంది. పరిశ్రమలో మంచి అవకాశాలు వస్తున్న తరుణంలో ఇలాంటి ఘటన జరగటం దురదృష్టకరం. 123తెలుగు.కాం ఆమె మృతికి సంతాపం తెలియజేస్తుంది.