గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “పెద్ది” కోసం అందరికీ తెలిసిందే. రూరల్ బ్యాక్ డ్రాప్ లో క్రికెట్ ప్రధాన అంశంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ కొంచెం ఆలస్యంగా మొదలైనా శరవేగంగా కంప్లీట్ అవుతుంది. అయితే పెద్ది ఫస్ట్ షాట్ అంటూ రిలీజ్ కి వచ్చిన గ్లింప్స్ భారీ రీచ్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
మరి లేటెస్ట్ గా బుచ్చిబాబు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలు తాను పంచుకున్నాడు. ఇలా పెద్ది ఆల్బమ్ పై కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. ఈ సినిమాకి లెజెండరీ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం రెహమాన్ ప్రతీ పాటకి కూడా తాను 20 నుంచి 30 ఆప్షన్స్ మాకు ఇచ్చేవారని అలాగే సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది అని బుచ్చిబాబు తెలిపాడు. మరి మొత్తానికి వీరు మాత్రం గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని చెప్పాలి.