డిసెంబర్ 20న బ్రోకర్ ఆడియో విడుదల

డిసెంబర్ 20న బ్రోకర్ ఆడియో విడుదల

Published on Nov 29, 2013 6:00 PM IST

broker-2

2010లో విడుదలైన ‘బ్రోకర్’ సినిమా ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు ‘బ్రోకర్ 2’ త్వరలో విడుదలకానుంది. ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళి ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. డిసెంబర్ 20న ఆడియో విడుదల వేడుక నిర్వహిస్తుండగా జనవరి చివరివారంలో విడుదలకానుంది

మద్దినేని రమేష్ ఈ సినిమాని నిర్మించడమే కాక దర్శకత్వం కూడా వహించాడు. విజయ్ బాలాజీ సంగీత దర్శకుడు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టాకీ భాగం ఈరోజుతో(నవంబర్ 29తో) ముగిసింది

‘బ్రోకర్ 2’ సినిమా రాజకీయ నేపధ్యంలో సాగుతున్న చిత్రం

తాజా వార్తలు