“లైలా” ఓటిటి రిలీజ్ కి బ్రేక్!?

“లైలా” ఓటిటి రిలీజ్ కి బ్రేక్!?

Published on Mar 7, 2025 5:05 PM IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “లైలా” కోసం తెలిసిందే. గత ఫిబ్రవరి వాలెంటైన్స్ డే కానుకగా వచ్చిన ఈ చిత్రం విశ్వక్ సేన్ కెరీర్లో డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ చిత్రం అనుకున్న రేంజ్ సక్సెస్ అందుకోకపోవడంతో విశ్వక్ కూడా తన నుంచి ఇక ఈ తరహా సినిమాలు రావని కూడా తెలిపాడు.

ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంలో తాను డ్యూయల్ రోల్ చేయగా దర్శకుడు రామ్ నారాయణన్ తెరక్కించారు. అయితే ఈ సినిమాని నెల తిరక్కుండానే ఓటిటి డేట్ ని ఇచ్చేసారు. అమెజాన్ ప్రైమ్, ఆహా లలో ఈ సినిమా నేడు మార్చ్ 7 నుంచే రావాల్సి ఉంది కానీ ఈ సినిమా ఇప్పటికీ (ఈ ఆర్టికల్ పబ్లిష్) అయ్యే సమయానికి కూడా రాలేదు. దీనితో లైలా ఓటిటి డీల్ విషయంలో ఏమన్నా పొరపథ్యాలు జరిగాయా లేక కావాలనే ఆపారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. మొత్తానికి మాత్రం లైలా ఓటిటి రిలీజ్ కి బ్రేక్ పడిపోయింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు