నథాలియ కౌర్, రామ్ గోపాల్ పరిచయం చేసిన ఈ మోడల్ తెలుగులో మరొక ఐటెం సాంగ్ ని సొంతం చేసుకుంది ఈసారి తన కాలు కలుపుతుంది అక్కినేని నాగార్జునతో. “భాయ్” చిత్రంలోని ఈ పాటలో కొంత భాగం ఇప్పటికే బ్యాంకాక్ లో చిత్రీకరణ జరుపుకున్నట్లు తెలుస్తుంది మిగిలిన భాగం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ విషయాన్నీ నథాలియ కౌర్ దృవీకరించారు. ప్రస్తుతం ఈ మోడల్ ఈరోజు శిల్పకళా వేదికలో జరగనున్న మా మ్యూజిక్ అవార్డ్స్ లో ప్రదర్శన ఇవ్వడానికి సన్నధం అవుతున్నారు. త్వరలో ఈ భామ నవీన్ చంద్ర, పియా బాజ్పాయ్ ప్రధాన పాత్రలలో రానున్న “దళం” చిత్రంలో ఐటెం సాంగ్లో కనిపించనున్నారు.
వీరభద్రం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. రిచా గంగోపాధ్యాయ్ ఈ చిత్రంలో నాగార్జున సరసన కనిపించనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.