రవితేజకి థాంక్స్ చెప్పిన బ్రహ్మాజీ

Brahmaji-raviteja
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్రహ్మాజీ గత 20 సంవత్సరాలుగా ఉంటూ క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించాడు. అలాగే అతను కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ‘సింధూరం’ సినిమాలో హీరోగా కూడా చేసాడు. ఆ సినిమా హిట్ అయ్యుంటే ఇప్పుడు అతను ఇప్పుడు వేరే స్థానంలో ఉండేవాడు. అదే సినిమాలో చిన్న పాత్ర చేసిన రవితేజ ఇప్పుడు హీరోగా ఉన్నత స్థానాలను చేరుకున్నాడు.

రవితేజతో పోల్చుకుంటే మీరు వెనుకబడి ఉన్నారా అని బ్రహ్మాజీని అడిగితే సమాధానమిస్తూ ‘ రవితేజ నా క్లోజ్ ఫ్రెండ్. మేమిద్దరం చాలా కాలంగా మంచి ఫ్రెండ్స్. రవితేజ బిహేవియర్ లో అప్పటికీ ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదు. అదే ఈ రోజు అతన్ని ఆ స్థానంలో నిలిపింది. ఒక స్నేహితుడుగా అతను ఈ రోజు ఉన్న పొజిషన్ చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. చెప్పాలంటే అతని రికమండేషన్ వల్లే చాలా సినిమాల్లో నాకు రోల్స్ వచ్చాయి. అందుకు నేనే అతనికి థాంక్స్ చెప్పాలని’ అన్నాడు.

Exit mobile version