తెలుగులో టాప్ కమెడియన్ బ్రహ్మానందం కొడుకు గౌతమ్ త్వరలో ఒక ఇంటి వాడు కాబోతున్నాడు. ‘పల్లకిలో పెళ్లి కూతురు’ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ ఆ తరువాత వారెవా అని మరో సినిమా చేసాడు. కాని హీరోగా మాత్రం నిలదొక్కుకోలేక పోయాడు. సినిమాటోగ్రాఫర్ శ్రీనివాస్ రెడ్డి కూతురుతో గౌతమ్ వివాహం ఖరారైంది. ఈ నెల 24న హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో అంగరంగ వైభవంగా జరగనుంది. బ్రహ్మానందం, శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు ఇండస్ట్రీ వారె కావడంతో ఇండస్ట్రీ లోని ప్రముఖులంతా వీరి వివాహానికి హాజరు కానున్నారు.