ఫిబ్రవరిలో రానున్న బ్రాహ్మి జఫ్ఫా

ఫిబ్రవరిలో రానున్న బ్రాహ్మి జఫ్ఫా

Published on Jan 19, 2013 9:25 AM IST

Jaffa

బ్రహ్మానందం ప్రధాన పాత్రలో రాబోతున్న చిత్రం “జఫ్ఫా” గత ఏడాది ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పటి నుండి అందరిలో ఆసక్తి నెలకొంది. ఆ తరువాత ఈ చిత్రం గురించి ఎటువంటి వార్త వెలువడలేదు. తాజాగా ఈ చిత్ర దర్శకుడు కిషోర్ ఈ చిత్రం గురించి వెల్లడించారు ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర దశలు జరుపుకుంటుంది అని చెప్పారు.ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది. శ్రావణ్, అలీ మరియు ఫిష్ వెంకట్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా రమేష్ వర్మ నిర్మిస్తున్నారు. ఈ బ్రహ్మానందం చేస్తున్నది సీరియస్ పాత్ర అయినా ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడం ఖాయం.

తాజా వార్తలు