పద్మశ్రీ బ్రహ్మానందం చేతుల మీదుగా ‘ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్‌బర్గ్’ ప్రారంభం

హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో ‘ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్‌బర్గ్’ కొత్త బ్రాంచ్ ఘనంగా ప్రారంభమైంది. దసరా వేళ జరిగిన ఈ కార్యక్రమాన్ని పద్మశ్రీ డా. బ్రహ్మానందం ప్రారంభించి, ఆర్గానిక్ పదార్థాలతో తయారైన ఐస్‌క్రీంలను అందరూ ఆస్వాదించాలని ఆహ్వానించారు.

డాక్టర్ సుహాస్ బి. శెట్టి నాయకత్వంలో నడుస్తున్న ఈ క్రీమరీ, ఆరోగ్యకరమైన సేంద్రీయ పదార్థాలతో ప్రత్యేక రుచులను అందించనుంది. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా డా. బ్రహ్మానందం హాజరై, ఈ కొత్త వెంచర్ విజయవంతం కావాలని ఆశించారు.

ఈ సందర్భంగా నీలోఫర్ కేఫ్ అధినేత ఎ. బాబురావు, సుమన్ టీవీ అధినేత సుమన్ దూడి ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. అతిథులంతా ఐస్‌బర్గ్ ఆర్గానిక్ ఉత్పత్తులను రుచి చూసి, సేంద్రీయతపై సంస్థ నిబద్ధతను ప్రశంసించారు.

Exit mobile version