పద్మను వదులుకోనున్న బ్రహ్మ

brahmanandam-2-30

బ్రహ్మానందానిది తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరిచయం అవసరంలేని పేరు. అతని స్థానం ఎన్నటికీ చెక్కుచెదరదు. తన సినిమాలలో పేర్ల ముందు పద్మ అన్న బిరుదును వాడుకోవద్దని ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఆదేశించింది

ఈ ఆదేశానికి బ్రహ్మీ స్పందిస్తూ తన సినిమాలలో బిరుదుని తీసేయమని సెన్సార్ బోర్డుకు విన్నవించాడట.”ఒక పత్రికతో మాట్లాడుతూ ” నేను ఒక సినిమా షూట్ ముగించుకున్న వెంటనే మరో సినిమాలో బిజీ అయిపోతా. నిజానికి నాకు ఆ సినిమాలు చూసే తీరిక కూడా వుండదు. అందుకనే టైటిల్ లలో నా బిరుదలు పట్టించుకొను. దానిని తీసేయమని సెన్సార్ కు చెప్పాను” అని తెలిపాడు

బ్రహ్మానందం ప్రస్తుతం లెక్కపెట్టలేనన్ని సినిమాలలో నటిస్తున్నాడు. అంతేకాక అనీస్ బజ్మీ తీస్తున్న ‘వెల్కం బ్యాక్’ లో ఒక ప్రత్యేక పాత్రపోషిస్తున్నాడు

Exit mobile version