పొలిటికల్ వార్తల్ని కొట్టి పారేసిన బ్రహ్మానందం

పొలిటికల్ వార్తల్ని కొట్టి పారేసిన బ్రహ్మానందం

Published on Mar 25, 2014 7:33 PM IST

brahmanandam

టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం రాజకీయాల్లోకి రావడం లేదు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రాజకీయాల్లోకి వస్తున్నారు. కానీ బ్రహ్మనందం మాత్రం తన భవిష్యత్ కార్యాచరణపై తనకు చాలా క్లారిటీ ఉందని, రాజకీయాలు తనకి పడవని అంటున్నాడు.

అలాగే తను ఎందుకు రాకూడదు అని అనుకుంటున్నాను అనే దానికి కూడా ఓ ఆసక్తికరమైన విషయం చెప్పాడు. ‘మా గురువు సుబ్బరామి రెడ్డి గారు మరియు నా కెరీర్ మొదట్లో నాకెంతో సపోర్ట్ ఇచ్చిన చిరంజీవి గారు గతంలో నాకు ఆఫర్స్ ఇస్తేనే నేను రిజెక్ట్ చేసాను. అలాంటిది ఇప్పుడు ఎందుకు వస్తానని’ బ్రహ్మనందం అన్నాడు.

ప్రస్తుతం బ్రహ్మనందం టాలీవుడ్ లో వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.

తాజా వార్తలు