మత గురువుగా మారిన బ్రహ్మానందం.!

bramanandham
గత కొద్ది సంవత్సరాలుగా కామెడీ స్టార్ బ్రహ్మానందం ఎన్నో రకాల వైవిధ్యమైన పాత్రలు చేసాడు. డైరెక్టర్స్ ఎలాంటి పాత్రలు ఇచ్చినా తన టాలెంట్, హావభావాలతో ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నాడు. త్వరలో రిలీజ్ కానున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘హార్ట్ అటాక్’ సినిమాలో బ్రహ్మానందం ఓ ఆసక్తికరమైన పాత్రలో కనిపించనున్నాడు. నిన్న విడుదల చేసిన టీజర్ ప్రకారం చూసుకుంటే బ్రహ్మానందం ఈ సినిమాలో ఓ మత గురువుగా లేదా ఒక మత సంబంధమైన సాధువులా కనిపించనున్నాడు.

నితిన్, ఆద శర్మ జంటగా నటిస్తున్న ఈ సినిమాకి దర్శకుడు మరియు నిర్మాత పూరి జగన్నాథ్. 2014 సంక్రాంతి కానుకగా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

Exit mobile version