మరోసారి తన సామర్థ్యాన్నినిరుపించ్చుకున్న బోయపాటి

మరోసారి తన సామర్థ్యాన్నినిరుపించ్చుకున్న బోయపాటి

Published on Mar 30, 2014 3:00 AM IST

Boyapati-Sreenu11

మాటల తోనే కాదు, తన చేతలతో కూడా తనను తాను నిరుపించ్చుకోగాలనని బోయపాటి శ్రీను మరోసారి నిరూపించారు. ఇటీవల విడుదల అయిన ‘లెజెండ్’ బోయపాటి ప్రతిభకు నిజాయితీకి మరో ఉదాహరణ.

సినిమా షూటింగ్ మొదలయిన రోజు నుండి ఆడియో విడుదల రోజు వరకు, ఎంతో కృషి పట్టుదలతో పని చేసి, చిత్ర విజయం లో ఒక ప్రధాన పాత్ర పోషించాడు. తను యాక్షన్ ఎంటర్ టైనర్స్ కి పెట్టింది పేరు అని మరోసారి రుజువు చేసుకున్నారు. అభిమానులు బాలకృష్ణ సినిమా నుండి ఏదైతే ఆశిస్తారో అది అందించగలనని ‘లెజెండ్’తో మరోసారి చూపించాడు.

బాలయ్య బాబుని సింహ సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్రలో చూపించి విజయవంతమైన బోయపాటి ‘లెజెండ్’లో కూడా అదే కొనసాగించాడు. జగపతి బాబు నుండి అధ్బుతమైన నటనను రాబట్టుకోవడంలో బోయపాటి విజయం సాధించాడు.

‘లెజెండ్’ విజయంతో బోయపాటి ఇప్పుడు ఉన్నత దర్శకులు జాబితాలో చేరారు. ప్రస్తుతం ఇండస్ట్రీలోని ప్రతి హీరో ఈ హిట్ దర్శకుడితో పని చేయడానికి ఎదురుచూస్తున్నారు.

తాజా వార్తలు