బాలయ్యను కన్విన్స్ చేయడం చాలా ఈజీ అట.

బాలయ్యను కన్విన్స్ చేయడం చాలా ఈజీ అట.

Published on May 1, 2020 11:00 PM IST

ఈ జనరేషన్ దర్శకులలో బాలకృష్ణ ఇమేజ్ మరియు మేనరిజం కి తగ్గట్టుగా సినిమాలు తీసి భారీ హిట్స్ అందుకున్న ఒకే ఒక దర్శకుడు బోయపాటి శ్రీను. బాలయ్యతో ఆయన చేసిన సింహ, లెజెండ్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. ఈనేపథ్యంలో బాలయ్యకు ఆయనకు ఎలా కుదిరించి అని అడిగితే బోయపాటి ఆసక్తికర సమాధానాలు చెప్పారు. ఏ విషయమైనా క్లారిటీగా వివరిస్తే బాలయ్యను కన్వీన్స్ చేయడం ఈజీ అట. ఓ పాట కావచ్చు, ఫైట్ కావచ్చు ముందు టెక్నిషియన్స్ తో డిస్కస్ చేసిన తరువాత బోయపాటి బాలకృష్ణకు వివరంగా చెప్పేవారట.

అలాగే బాలయ్యకు ఏ సన్నివేశం రాసిన అది ఆయన సహజ మేనరిజం కి సరిపోయేలా ఉండాలి అన్నారు. ఫోర్స్డ్ సన్నివేశాలు, మేనరిజం బాలయ్యకు సెట్ కాదని బోయపాటి చెప్పుకొచ్చారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి నిర్మాతగా మిర్యాల రవీంధర్ రెడ్డి ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు