కొత్త లుక్ లో కనిపించనున్న బాలయ్య

కొత్త లుక్ లో కనిపించనున్న బాలయ్య

Published on Jun 17, 2013 3:14 PM IST

Boyapati-Sreenu

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరో వస్తున్న సినిమా షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి. ‘సింహ’ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై బారీ అంచనాలు వున్నాయి. ‘సింహ’లో బాలకృష్ణ ని పూర్తి గా చేంజ్ చేసి చూపించారు బోయపాటి. మాకందిన సమాచారం ప్రకారం బోయపాటి ఈ సినిమాలో బాలకృష్ణని ఒక కొత్త లుక్ లో చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడట. మరొకసారి స్పెషల్ మీసంతో గ్రాండ్ గా చూపించడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు అని సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది. సాయి కొర్రపాటి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా 2014 మొదట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

తాజా వార్తలు