చాలా రోజుల తర్వాత నందమూరి బాలకృష్ణ ఎట్టకేలకు మళ్ళీ తన సినిమా సెట్స్ లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం బాలకృష్ణ తనకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బోయపాటి శ్రీనుతో కలిసి ఓ సినిమా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా షూటింగ్ ఈ రోజు ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ మొదలైంది. షూటింగ్ మొదలు పెట్టిన రోజే బాలకృష్ణ పై రామ్ లక్షణ్ మాస్టర్స్ నేతృత్వంలో ఓ యాక్షన్ ఎపిసోడ్ ని తెరకెక్కిస్తున్నారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.
ఇద్దరు హీరోయిన్స్ ఉండే ఈ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్ గా హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ ఎంపిక కాగా మరో హీరోయిన్ ఎంపిక జరగాల్సి ఉంది. ఈ మూవీని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు. ‘సింహా’ తర్వాత బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.