కోటా గారితో వర్క్ పై జెనీలియా ఎమోషనల్ పోస్ట్!

కోటా గారితో వర్క్ పై జెనీలియా ఎమోషనల్ పోస్ట్!

Published on Jul 13, 2025 5:00 PM IST

తెలుగు సినిమా దిగ్గజ నటుడు కొత్త శ్రీనివాసరావు గారు లేరు అనే వార్త ఇప్పటికీ చాలా మంది నమ్మలేకపొతున్నారు. కానీ ఈ చేదు నిజం విషయంలో అనేకమంది సినీ ప్రముఖులు కూడా తమ స్పందన సోషల్ మీడియా సహా కోటా గారి ఇంటికి చేరి తమ అశ్రు నివాళి అర్పించారు. అయితే ఈ మహానటునితో స్క్రీన్ షేర్ చేసుకున్న కొందరు యువ నటీనటుల్లో హీరోయిన్ జెనీలియా కూడా ఒకరు.

తమ కాంబినేషన్ లో వచ్చిన భారీ హిట్ చిత్రం “బొమ్మరిల్లు”లో తండ్రీ కూతుళ్లుగా వీరి పాత్రలు అందులోని వారి కెమిస్ట్రీ ఎంతగానో పండింది. ఇలా చేసింది ఒక్క సినిమా అయినా వీరిద్దరి పాత్రలు కూడా గుర్తుండిపోయాయి. మరి ఇలాంటి సినిమా చేసిన తర్వాత కోటా గారిపై వచ్చిన విషాద వార్తపై జెనీలియా స్పందన వైరల్ గా మారింది.

‘మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది నాకు ఒక విలువైన నిధి లాంటిది అని మీరు నాకు చాలా చాలా నేర్పించారు. మీ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అని తన హాసిని చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇపుడు మరింత ఎమోషనల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు