ఇప్పటి నుండి తెలుగులోనూ నటిస్తానన్న బోమన్ ఇరానీ

ఇప్పటి నుండి తెలుగులోనూ నటిస్తానన్న బోమన్ ఇరానీ

Published on Oct 19, 2013 3:32 PM IST

boman-irani
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “అత్తారింటికి దారేది” సినిమాలో పనిచేయడం ఆనందంగా ఉందని చాలా మంది అన్నారు. వారిలో బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ కూడా ఒకరు. తనకు టాలీవుడ్ లో నటించడం చాలా ఆనందంగా ఉందని అన్నాడు. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో నటించిన బోమన్ కి టాలీవుడ్ పై మంచి ఇంప్రెషన్ కలిగింది. ఇక్కడ మరికొన్ని సినిమాలను తీయాలని ఉందని ఆయన అన్నాడు. ఆయన తాజాగా ముంబైలో ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘ దక్షిణ భారత దేశం వారి నైపుణ్యాన్ని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. వారు వారి సినిమాలను పూర్తి అంకిత భావంతో, హార్డ్ వర్క్ తో నిర్మిస్తారు. నాకు చాలా అక్కడ నుండి చాలా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటి నుండి తప్పకుండ నేను తెలుగు సినిమాలలో నటిస్తాను’ అని అన్నాడు.

బోమన్ ఇరానీ ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో నదియ ఒక ముఖ్య పాత్రలో నటించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద మంచి కలెక్షన్ లను వసూలు చేస్తోంది.

తాజా వార్తలు