యూనివర్సల్ హీరో కమల హసన్ హీరోగా నటించిన ‘విశ్వరూపం’ సినిమా మంచి హిట్ ను సాదించింది. దీనికి సీక్వెల్ గా వస్తున్న ‘విశ్వరూపం 2’ సినిమా ట్రైలర్ ని ఈ మద్య జరిగిన ఐఫా అవార్డ్ ఫంక్షన్ లో లాంచ్ చేయడం జరిగింది. ఈ ట్రైలర్ ని చూసిన బాలీవుడ్ ప్రముఖుల నుండి మంచి స్పందన లబించింది. ఈ సందర్భంగా కమల హసన్ మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ దాదాపు 90% ముగిసింది అని చెప్పాడు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను, ఫైట్ లను నీటిలోపల షూట్ చేయడం జరిగిందని ఆ సన్నివేశాలు చాలా భాగా వచ్చాయని నిర్వాహకులు చెప్పడం జరిగింది. ఈ సినిమాలో కమల హసన్ సరసన పూజ కుమార్ హీరోయిన్ గా నటిస్తోంది. కమల హసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని వేణు రవిచంద్రన్, ఏక్త కపూర్, శోభ కపూర్ లు నిర్మిస్తున్నారు. ఘిబ్రన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా ఈ దీపావళికి విడుదలయ్యె అవకాశం ఉంది.