బెదిరింపులకు ఈ స్టార్ హీరోయిన్ మాస్ రిప్లై.!

గత కొన్ని వారాల కితం బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్యా ఘటన ఎంతటి సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. ఈ ఘటన అనంతరం బాలీవుడ్ నుంచి ఈ ఘటనకు సంబంధించి గట్టిగా మాట్లాడిన స్టార్ హీరోయిన్ ఎవరన్నా ఉన్నారు అంటే అది క్వీన్ కంగనా రనౌత్ అని చెప్పాలి.

ఈ ఘటనపై చాలా రోజులు నుంచి ఎప్పటికపుడు సంచలనం రేపుతున్నారు. అలాగే ఇంకా పలు కాంట్రవర్సీలు కూడా కంగనా పై ఎప్పుడు వినిపిస్తాయన్న సంగతి తెలిసిందే. మరి అలా ఇపుడు ఆమె పొలిటికల్ వచ్చే ఇబ్బందులను కూడా ధీటుగా ఎదుర్కొంటున్నారు.

ఆమెను ముంబై లోకి రానివ్వమని పలువురు బెదిరింపులు ఇచ్చారని కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను ఈ వచ్చే సెప్టెంబర్ 9 వ తారీఖున ముంబై వస్తున్నానని ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యాక సమయాన్ని కూడా పోస్ట్ చేస్తానని ఎవరు వచ్చి అడ్డకుంటారో చూస్తానని కంగనా మాస్ రిప్లై ఇచ్చారు. ఇపుడు ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Exit mobile version