బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ ఇర్ఫాన్ నేడు తుది శ్వాస విడిచాడు. కొన్నాళ్లుగా ఆయన అరుదైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. నిన్న ఆయన ఆరోగ్యం విషమించడంతో ఐ సి యూ లో చేర్చడం జరిగింది. నేడు ఉదయం ఆయన తుది శ్వాస విడిచినట్టు ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు. బాలీవుడ్ తో పాటు ఆయన అనేక హాలీవుడ్ చిత్రాలలో నటించి మెప్పించారు.
ఆయన నటించిన లైఫ్ ఆఫ్ ఫై నాలుగు ఆస్కార్ అవార్డ్స్ గెలుపొందింది. ఇక తెలుగులో ఆయన మహేష్ హీరోగా దర్శకుడు గుణ శేఖర్ తెరకెక్కించిన సైనికుడు సినిమాలో విలన్ రోల్ చేశారు. ముంబైలో నేడు లేదా రేపు ఆయన అంత్యక్రియలు జరిగే అవకాశం కలదు. ఇర్ఫాన్ ఖాన్ వయసు కేవలం 54 సంవత్సరాలు మాత్రమే. సుకాపా సిక్డర్ భార్య కాగా బాబిల్ మరియు అయాన్ అనే ఇద్దరు కుమారులు కలరు. 2018 ఫిబ్రవరిలో ఆయన అరుదైన కాన్సర్ కి గురైనట్లు వైద్యులు ధ్రువీకరించారు.