తెలుగులో చాలా చిత్రాల విడుదల వాయిదాలు పడటంతో ఈ వారం బాక్స్ ఆఫీస్ వద్ద బాలివుడ్ చిత్రాల ఆధిపత్యం కొనసాగుతుంది. పండగ సమయం కావడం ఈ సమయంలో ఏ తెలుగు చిత్రం విడుదల లేకపోవడం కాస్త విచారించాల్సిన విషయమే తమిళ డబ్బింగ్ చిత్రం “తుపాకి” కూడా విడుదల ఆలస్యం కావడంతో ఈరోజు హిందీ చిత్రాలు అయిన “జబ్ తక్ హయ్ జాన్” మరియు “సన్ ఆఫ్ సర్దార్” బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తున్న చిత్రాలు. ఈ పండగ సందర్భంగా ఒక్క తెలుగు చిత్రం కూడా లేకపోవడం బాధాకరమయిన విషయం.