ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆసిఫ్ బస్రా ఆత్మహత్య చేసుకున్నారు. ధర్మశాలలోని తన అపార్ట్మెంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. అయితే ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఫోరెన్సిక్ బృందం ఇప్పటికే విచారణ స్టార్ట్ చేశారు. ఆసిఫ్ మృతితో బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ ముందే ఆయన్ను కలిశామని, ఇంతలోనే ఏమైందో తెలియట్లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు.
53 ఏళ్ల ఆసిఫ్ బస్రా 1998లో నటుడిగా కెరీర్ స్టార్ట్ చేశారు. ‘కై పో చే, హిచ్ కీ, క్రిష్ 3, జబ్ వి మెట్, బ్లాక్ ఫ్రైడే, ఏక్ విలన్, బిగ్ బ్రదర్’ లాంటి సినిమాల్లో నటించారు. అలాగే ‘ఔట్ సోర్స్’ అనే హాలీవుడ్ చిత్రంలో ‘పాతాళ్ లోక్, వో, హోస్టేజ్’ వంటి వెబ్ సిరీస్ లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాది పలువురు సినీ ప్రముఖుల ఆకస్మిక మరణాలతో కదిలిపోయిన సినీ పరిశ్రమకు తాజాగా ఆసిఫ్ బస్రా ఆత్మహత్య మరింత బాధను మిగిల్చింది.