విక్టరీ వెంకటేష్ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘బాడీగార్డ్’. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు ఈ రోజు జరగనున్నాయి. మలయాళంలో రూపొందిన ‘బాడీగార్డ్ చిత్రానికి రిమేక్ గా ఈ చిత్రంలో వెంకీ సరసన త్రిషా హీరోయిన్ గా నటిస్తుండగా సలోని కీలక పాత్రలో నటిస్తున్నారు.
శ్రీ సాయి గణేష్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందించిన ఆడియో ఇటీవలే విడుదలవగా ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. మహేష్ బాబు నటించిన ‘బిజినెస్ మేన్’ చిత్రంతో పాటు ‘బాడీగార్డ్’ చిత్రం కూడా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.