మాస్ మహారాజ రవితేజ మరియు ‘బలుపు’ రచయిత బాబీల సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సినిమాలో వైవిధ్యమైన పోలీస్ పాత్రలో రవితేజ అలరించనున్నాడు. సమాచారం ప్రకారం రవితేజ గెట్ అప్ పై బాబీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడట. ఇదే నిజమైతే చాలా రోజుల తరువాత మాస్ మహారాజని కొత్త అవతారంలో చూడచ్చు
ఈ సినిమాలో హన్సిక ప్రధాన నాయిక. రెండో హీరోయిన్ పేరు త్వరలో ప్రకటిస్తారు. ఈ సినిమా 2014 వేసవిలో మనముందుకు రానుంది. ఈ చిత్రంతో రాక్ లైన్ వెంకటేష్ నిర్మాతగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించనున్నాడు
ఈ మాస్ ఎంటర్టైనర్ కు థమన్ సంగీతదర్శకుడు