‘కూలీ’ బ్లాక్ బస్టర్.. లోకి, అనిరుద్ సెంటిమెంట్ ఫ్రేమ్ వైరల్

‘కూలీ’ బ్లాక్ బస్టర్.. లోకి, అనిరుద్ సెంటిమెంట్ ఫ్రేమ్ వైరల్

Published on Aug 10, 2025 8:03 PM IST

ప్రస్తుతం సౌత్ ఇండియాన్ సినిమా ఆడియెన్స్ సహా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా భారీ ఎత్తున ఎదురు చూస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ చిత్రం “కూలీ” కూడా ఒకటి. అయితే మేకర్స్ కంటే ఆడియెన్స్ చాలా నమ్మకంగా ఉంటే కొన్ని అంశాలు మాత్రం బ్లాక్ బస్టర్ సూచనలు అందిస్తున్నారు.

ఇలా ఓ సెంటిమెంట్ ఫ్రేమ్ ఇప్పుడు వైరల్ గా మారింది. గతంలో లియో, విక్రమ్ చిత్రాలకి ఫైనల్ మిక్సింగ్ తర్వాత తమ హీరోల కంటి ఫ్రేమ్ ముందు లోకేష్ ఇంకా అనిరుద్ లు కలిసి ఉన్న ఫ్రేమ్ ని లోకేష్ షేర్ చేసాడు. దీనితో అంటే బ్లాక్ బస్టర్ ఇస్తున్నారని కన్ఫర్మ్ అయ్యిపోయినట్టే. ఇప్పుడు ఆ రెండు సినిమాలు తర్వాత కూలీ కి కూడా ఇదే ఫ్రేమ్ ఇప్పుడు వైరల్ అవుతుంది. దీనితో కూలీ కూడా బ్లాక్ బస్టర్ అని అభిమానులు నమ్ముతున్నారు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ ఆగస్ట్ 14 వరకు ఆగాల్సిందే.

LokeshKanakraju

తాజా వార్తలు