“బ్లాక్ పాంథర్” హీరో మృతి..కారణం ఇదే!

“బ్లాక్ పాంథర్” హీరో మృతి..కారణం ఇదే!

Published on Aug 29, 2020 9:06 AM IST

ఇది నిజంగా మార్వెల్ అభిమానులకు షాకింగ్ వార్తే అని చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా మార్వెల్ కామిక్స్ కు గాని అందులోని ఉండే సూపర్ హీరోలకు కానీ అపారమైన క్రేజ్ ఉంది. అలాంటి ఒక సూపర్ హీరోల రోల్స్ లో “బ్లాక్ పాంథర్” రోల్ కూడా ఒకటి. ఒక్క “బ్లాక్ పాంథర్” చిత్రంలో మాత్రమే కాకుండా పలు అవెంజర్స్ సిరీస్ లలో కూడా కనిపించిన హీరో చద్విక్ బోస్మేన్ మృతి చెందిన వార్త ఇపుడు బయటకొచ్చింది.ఇది నిజంగా మార్వెల్ ఫ్యాన్స్ కు ఒక తీరని లోటు.

అయితే అతను తన 43 ఏళ్ల వయసులో ఎందుకు చనిపోవాల్సి వచ్చిందో ఇపుడు కారణం తెలుస్తుంది. బ్లాక్ పాంథర్ రోల్ కు అత్యద్భుతంగా జస్టిస్ చేసిన ఈ హీరో గత నాలుగేళ్ల నుంచి కొలోన్ అనే క్యాన్సర్ తో బాధ పడుతున్నాడట. కానీ ఇపుడు ఆ క్యాన్సర్ తీవ్రత ఎక్కువ కావడంతో అతను తన కుటింబీకులు ఉండగానే తన ఇంట్లోనే మరణించాడు. ఇది నిజంగా చాలా బాధాకరం. ఇప్పటికే అవెంజర్స్ ఎండ్ గేమ్ అనంతరం “బ్లాక్ పాంథర్ 2” మూవీ ని కూడా ప్లాన్ చేసారు. కానీ ఈలోపులే ఇలాంటి విషాదం నెలకొనడం బాధాకరం.

తాజా వార్తలు