తెలుగు చిత్ర సీమకి నేడు బ్లాక్ డే

AD
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి నేను బ్లాకు డే అని చెప్పుకోవాలి. కొంతమంది పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమాని 90 నిమిషాలు నిడివి గల వీడియోని ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేసారు.

ఈ సినిమా రిలీజ్ అనుకున్న సమయం నుంచి ఈ చిత్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ అంతా రాజకీయ పరిస్తితుల వల్ల పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి ఈ విషయం తెరుకోలేని షాక్ ని ఇచ్చింది.

ఈ చిత్ర నిర్మాత ఈ సినిమాపై కొన్ని కోట్ల రోపాయలు ఇన్వెస్ట్ చేసారు. కానీ ఎవరో తన స్వలాభం కోసం ఈ సినిమాని రిలీజ్ చెయ్యడం చాలా బాధాకరమైన విషయం. ఒక వేల ఈ సినిమా రిలీజ్ అయ్యి సినిమా బాక్స్ ఆఫీసు వద్ద విజయం సాధింనప్పుడు ఇలాంటి పైరేట్ సీడీలు బయటకి వస్తే కొంతవరకు పరవాలేధనుకోవచ్చు కానీ సినిమా విడుదల కాకముందే ఇలా నెట్ లో దర్శనమివ్వడం అనేది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం. ఇలాంటి దారుణమైన పనిలో బాగాస్వాములుగా ఉన్న అందరూ ఇలాంటి ఇల్లీగల్ పనులు చేసేటప్పుడు వాళ్ళు కొన్ని వందలమంది నోటికాడకూడును లాగేస్తున్నారనే విషయాన్ని గుర్తించుకోవాలి.

ప్రస్తుతం టాలీవుడ్ లోని అందరి హీరోల అభిమానులు అన్ని పక్కన పెట్టి ఈ పైరసీని అడ్డుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ఇలాంటి సంఘటన బివిఎస్ఎన్ ప్రసాద్, పవన్ కళ్యాణ్ కి జరిగి ఉండవచ్చు కానీ ఇదే విషయం రేపు వేరే వారికి కూడా జరగచ్చు. సీడీల పైరసీ పరంగా మీకు ఎలాంటి లింక్స్ అన్నా కనపడితే కింద ఇచ్చిన మెయిల్ కి రిపోర్ట్ చెయ్యండి.

legal@apfilmchamber.com or ad@apfilmchamber.com .

అలాగే ఎవరన్నా సీడీ షాపుల్లో అమ్ముతున్నారని తెలిస్తే దగ్గరలోని పోలీసులకి తెలియజేయండి. ఇలాంటి కష్ట కాలంలో బివిఎస్ఎన్ ప్రసాద్ ని సపోర్ట్ చెయ్యండి. పైరసీని కిల్ చేసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని కాపాడండి..

Exit mobile version