“అవకాయ్ బిర్యాని” చిత్రంతో తెలుగుకి పరిచయమయిన బిందు మాధవి మరియు “రంగం” చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న పియ బాజ్పాయి ఇద్దరు “తోలన్” అనే చిత్ర చిత్రీకరణ సమయంలో గాయపడ్డారు. తమిళంలో ప్రముఖ హీరో విజయ్ నిర్మాతగా మారి చేస్తున్న తొలి ప్రయత్నం ఈ చిత్రం. ఈ చిత్రం కోసం ఒకానొక సన్నివేశంలో బిందు మాధవి మరియు పియ బాజ్పాయి లు హెలికాప్టర్ కి వేలాడుతూ నటించాలి ఆ సన్నివేశాన్ని హాంకాంగ్ లో తెరకేక్కిస్తుండగా పట్టు తప్పి ఇద్దరు కింద రక్షణ కోసం ఏర్పాటు చేసిన వలలో పడ్డారు పడగానే షాక్ కి గురై అందులో నుండి తెరుకోలేకపోయారు వెంటనే చిత్ర యూనిట్ వీరిద్దరిని హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. అప్పట్లో విజయ్ తండ్రి దర్శకనిర్మాతగా తెరకెక్కించిన ” సట్టమ్ ఒరు ఇరుట్టరయ్ ” అనే చిత్రాన్ని విజయ్ నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రానికి స్నేహ బ్రిట్టో దర్శకత్వం వహిస్తుండగా విజయ్ అంథోని సంగీతం అందించారు. ఈ చిత్రంలో తమన్ కుమార్ కథానాయకుడిగా కనిపించనున్నారు.