బిల్లా-2 చిత్రం పై అంచనాలను మరింత పెంచిన ఆడియో

బిల్లా-2 చిత్రం పై అంచనాలను మరింత పెంచిన ఆడియో

Published on May 2, 2012 6:41 PM IST


తమిళ్ సూపర్ స్టార్ అజిత్ రాబోతున్న చిత్రం “బిల్లా – 2” పై అంచనాలు భారీగా పెరిగాయి ఈ మధ్యనే విడుదలయిన ఈ చిత్రం ఆడియో ఈ చిత్రం మీద మరిన్ని అంచనాలు పెరిగేలా చేశాయి. ఈ చిత్ర ఆడియో ని కూడా ప్రేక్షకులు అద్బుతమయిన స్పందనతో ఆహ్వానించారు. ఈ చిత్రం తెలుగు లో “డేవిడ్ బిల్లా – ది బిగినింగ్” పేరుతో విడుదల కానుంది. ఈ చిత్ర తెలుగు పాటలు మే 10న విడుదల కానుంది. ఈ చిత్రం అజిత్ నటించిన బిల్లా చిత్రానికి ప్రీక్వెల్. పార్వతి ఓమనకుట్టన్,బ్రూణ అబ్దుల్లా కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి చక్రి తోలేటి దర్శకత్వం వహించారు. యువన్ శంకర్ రాజ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం తెలుగు మరియు తమిళంలో ఒకేసారి విడుదల కావడానికి సిద్దమయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు