ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషనల్ అండ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ మన తెలుగులో కూడా భారీ ఎత్తున ఆదరణను సొంతం చేసుకొంది. అలాగే ఇప్పుడు మొత్తం మూడు సీజన్లను పూర్తి చేసుకొని నాలుగో సీజన్ లో కూడా అంతే స్థాయి ఆదరణతో లాస్ట్ కు వచ్చేస్తుంది.
80 రోజులకు దగ్గరగా ఈ షో ఇప్పుడు ఫైనల్స్ కు రెడీ అవుతుంది. అయితే మేకర్స్ ఇప్పటికే అందుకు సన్నాహాలు సిద్ధం చేసేస్తున్నారట. ఇంకా సరిగ్గా నెల రోజుల్లో అంటే వచ్చే డిసెంబర్ 20 న ప్లాన్ చేస్తున్నారట. అలాగే ఈసారి కూడా ఒక సెన్సేషనల్ స్టార్ ను ఫైనల్ ఎపిసోడ్ కు తీసుకురానున్నారు.
అంతే కాకుండా సెట్ ను కూడా కంప్లీట్ డిఫరెంట్ గా మరియు చాలా గ్రాండ్ గా సెట్ చేస్తున్నారట. ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్స్ ఎప్పటి నుంచో అలా టాప్ లో కొనసాగుతూ వస్తున్నారు. మరి ఫైనల్స్ లోకి ఎవరు వస్తారో కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇది బిగ్ బాస్ ఏమన్నా జరగొచ్చు.