‘అజయ్ భూపతి’ కొత్త సినిమా పై లేటెస్ట్ అప్ డేట్

‘అజయ్ భూపతి’ కొత్త సినిమా పై లేటెస్ట్ అప్ డేట్

Published on Dec 8, 2025 9:02 AM IST

Ajay Bhupathi

దర్శకుడు అజయ్ భూపతి తన తదుపరి ప్రాజెక్ట్ ను లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ మనవడు, ఘట్టమనేని రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అధికారిక అప్ డేట్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. వచ్చే షెడ్యూల్ లో ఈ సీక్వెన్స్ కోసం తిరుపతిలో ప్రత్యేక సెట్ వేస్తున్నారని తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ షూట్ అనంతరం జయకృష్ణ పై ఓ సాంగ్ ను షూట్ చేస్తారట. ఈ సాంగ్ కోసం కూడా ప్రత్యేకంగా సెట్స్ కూడా వేస్తున్నారట. మరి జయకృష్ణ మొదటి సినిమాగా వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.

కాగా తిరుపతి నేపథ్యంలో హిందూ పుణ్యక్షేత్రం తిరుమల వెంకటేశ్వర ఆలయం చుట్టూ ఈ కథ సాగుతుందని తెలుస్తోంది. విష్ణువు స్వయంభుగా అవతరించిన ఈ క్షేత్రంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ కథా నేపథ్యం సాగుతుందని.. ఈ సినిమా మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. మొత్తానికి సినిమాలో ఎమోషనల్ డ్రామా కూడా చాలా బాగుంటుందని తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమాలో సీనియర్ కథానాయిక రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్ గా నటిస్తోందని తెలుస్తోంది. ఆమె కూడా ఈ సినిమాతోనే తెలుగులోకి అరంగేట్రం చేయబోతుంది. చందమామ కథలు పిక్చర్స్ పతాకంపై జెమిని కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు,

తాజా వార్తలు