ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలకు నిర్మాణం చాలా కష్టంగా మారింది. థియేట్రికల్‌గా ఏ స్టార్ హీరో సినిమా కూడా ప్రేక్షకుల నుంచి ఊహించిన రెస్పాన్స్ రావడం లేదు. దీంతో మేకర్స్‌కి తమ సినిమాల్లో షేర్ ఇవ్వడం వంటి డీల్స్‌తో కొన్ని కార్పొరేట్ సంస్థలు తెలుగు చిత్రాలకు ఫండింగ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇదే కోవలో మరో బడా కంపెనీ కూడా ఓ తెలుగు ప్రెస్టీజియస్ మూవీకి ఫండింగ్ చేసేందుకు ముందుకు వచ్చింది.
న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న నెక్స్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’ షూటింగ్ శుక్రవారం రోజున స్టార్ట్ అయ్యింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో క్రియేట్ అయ్యాయి. అయితే, ఈ సినిమాకు భారీ బడ్జెట్ అవసరం పడుతుండటంతో మేకర్స్ ఇతర ఫండింగ్ కంపెనీలతో డీల్స్ కుదుర్చుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సరిగమ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకు వచ్చింది.
సరిగమ ఈ చిత్రానికి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనుంది. ఇక ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తుండగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను మార్చి 26, 2026 లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.