‘అల వైకుంఠపురం’ ప్లాన్ ఫాలో అవుతున్న ‘భీష్మ’

‘అల వైకుంఠపురం’ ప్లాన్ ఫాలో అవుతున్న ‘భీష్మ’

Published on Feb 10, 2020 5:42 PM IST

ఈరోజుల్లో ప్రేక్షకులు సినిమాలో కథతో పాటు మంచి పాటలు కూడా ఉండాలని బలంగా కోరుకుంటున్నారు. టీజర్, ట్రైలర్లతో సమానంగా సాంగ్స్ సినిమా ప్రచారంలో, హైప్ పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇందుకు బెస్ట్ ఉదాహరణ ఇటీవల విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రం. పాటలతోనే సినిమా సగం హిట్టైంది. అందుకే ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు ‘భీష్మ’ టీమ్.

ఇప్పటికే మొదటి పాట ‘వాటే వాటే బ్యూటీ’తో మంచి బజ్ తెచ్చుకుని తాజాగా రెండవ పాట ‘సరాసరి గుండెల్లో దించావే’తో ఆకట్టుకుంటోంది. ఈ రెండు సాంగ్స్ ప్రేక్షకుల్లోకి బాగానే వెళ్లాయి. ఫలితంగా సినిమాకు పాజిటివ్ వాతావరణం కనబడుతోంది. ఆల్బమ్ లోని మిగతా పాటల్ని కూడా ఇలానే ఉండేలా చూసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు దర్శకుడు వెంకీ కుడుముల, సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్. ఇకపోతే ఇందులో నితిన్ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదలకానుంది.

తాజా వార్తలు