భీమవరం బుల్లోడుకి ‘యు/ఏ’ సర్టిఫికేట్

Bheemavaram-Bullodu-First-L
సునీల్ హీరోగా నటించిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ‘భీమవరం బుల్లోడు’. ఈ సినిమా ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకి ‘యు/ఏ’ సర్టిఫికేట్ వచ్చింది. మొదటగా సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని ఫిబ్రవరి మొదటి లేదా రెండవ వారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

సునీల్ సరసన ఎస్తర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ‘కలిసుందాం రా’ ఫేం ఉదయ శంకర్ డైరెక్టర్. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి. సురేష్ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సునీల్ కి హీరోగా మరో హిట్ వస్తుందని ఎంతో నమ్మకంగా ఉన్నాడు.

Exit mobile version