తారక్ టీజర్ కు ఆల్ సెట్..ఇదే బ్యాలెన్స్..?

తారక్ టీజర్ కు ఆల్ సెట్..ఇదే బ్యాలెన్స్..?

Published on Oct 14, 2020 1:13 PM IST

ఇపుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానుల కళ్లన్నీ రాజమౌళి వైపే ఉన్నాయి. తాను తెరకెక్కిస్తున్న లేటెస్ట్ బిగ్గెస్ట్ మల్టీ స్టారింగ్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” నుంచి కొమరం భీం గా తారక్ టీజర్ అండ్ ఫస్ట్ పోస్టర్ కోసమే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే తారక్ పై తీయాల్సి ఉన్న కొన్ని కీలక షాట్స్ ను ఇటీవలే స్టార్ట్ చేసిన షూట్ తో కంప్లీట్ చేసేసారు.

ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ టీజర్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి వినిపిస్తుంది. తారక్ పై కట్ చేసిన టీజర్ మొత్తం అవుట్ ఫుట్ కంప్లీట్ తెలుస్తుంది. అలాగే డైలాగ్స్ టాకీ కూడా చేసుకొని ఇంకొక్క ఫైనల్ టచ్ కోసం రెడీగా ఉన్నట్టు టాక్. ఈ టీజర్ కు ఇంకా కేవలం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకటే బాకీ అన్నట్టు తెలుస్తుంది. ఈ కొన్ని రోజుల్లో లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి పూర్తి చేసేసి ఫైనల్ అవుట్ ఫుట్ ను రాజమౌళికి ఇవ్వనున్నారట. మరి ఈ టీజర్ ను జక్కన్న ఎలా చెక్కారో చూడాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు