బాలీవుడ్లో జాక్ పాట్ కొట్టేసిన భరత్

Bharath
‘బాయ్స్’ సినిమాలో తన డాన్సులతో ఆకట్టుకొని ఆ తర్వాత ‘ప్రేమిస్తే’ సినిమాతో పిచ్చెక్కిన ప్రేమికుడి పాత్రలో మంచి పేరు తెచ్చుకొని అందరికీ గుర్తుండిపోయిన తమిళ హీరో భరత్ గుర్తున్నాడా.. గుర్తుండే ఉంటాడు.. ప్రేమిస్తే సినిమా చూసిన ఎవరూ అంత త్వరగా మరచిపోలేరు. ఆ తర్వాత తెలుగులో తక్కువగా కనిపించిన భరత్ కి ప్రస్తుతం బాలీవుడ్లో ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. డైరెక్టర్ కైజాద్ గుస్తాద్ భరత్ కి చాన్స్ ఇచ్చాడు. ఈ సినిమాకి ‘జాక్ పాట్’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. గోవా కాసినోల నేపధ్యంలో సాగే ఈ సినిమాలో సచిన్ జోషి, పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా భరత్ ఓ కీలకమైన పాత్రలో కనువిందు చేయనున్నాడు. ఇటీవలే తమిళ్ ఇండస్ట్రీ నుంచి ధనుష్ బాలీవుడ్ వెళ్లి సక్సెస్ అయ్యాడు, అదే కోవలోనే భరత్ కూడా సక్సెస్ అవుతాడో లేక దెబ్బతింటాడో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే..

Exit mobile version