‘కింగ్’ అక్కినేని నాగార్జున హీరోగా చేసిన ‘భాయ్’ సినిమా త్వరలోనే విడుదల కానుంది. నాగార్జున ఈ మూవీ లో ఫుల్ లెంగ్త్ మాస్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీ డైరెక్టర్ వీరభద్రం చౌదరి నాగార్జున కోసం కొన్ని పంచ్ డైలాగ్స్ రెడీ చేసాడు. ఈ పంచ్ డైలాగ్స్ కి ప్రొడక్షన్ టీం మరియు మీడియా ‘భాయ్ బుల్లెట్స్’ అని పేరు పెట్టుకున్నారు.
ఈ పంచ్ డైలాగ్స్ కి ఇంటర్నెట్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. భాయ్ టీం కొంతమంది ఫాన్స్ ని పిలిచారు, వారికి కొన్ని భాయ్ బుల్లెట్స్ చెప్పారు. వారు అందులోని కొన్ని అదిరిపోయే బుల్లెట్స్ ని ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేసారు.
ఫ్యాన్ పంపిన ఒక డైలాగ్ మీకోసం ‘ దేవుడిని చూడాలంటే పూజ చెయ్యాలి.. భాయ్ ని చూడాలంటే తప్పు చెయ్యాలి’.
దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ మూవీలో రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్ గా నటిస్తోంది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.