లెనిన్’ కోసం చక్కర్లు కొడుతున్న భాగ్యశ్రీ

యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి రూరల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో తొలుత హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ శ్రీలీల ఎంపికవగా, కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది.

ఇక ఇప్పుడు ఆమె స్థానంలో మరో బ్యూటీ భాగశ్రీ బొర్సే ఈ సినిమాలో హీరోయిన్‌గా జాయిన్ అయింది. ఈ సినిమా షూటింగ్ కోసం భాగ్యశ్రీ తీవ్రంగా శ్రమిస్తుందట. ఈ సినిమా కంటే ముందే భాగ్యశ్రీ పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రామ్ సరసన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’, దుల్కర్ సల్మాన్‌తో ‘కాంతా’ వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో ఆమె నటిస్తుంది.

దీంతో ఈ మూడు చిత్రాల షూటింగ్‌ల కోసం భాగ్యశ్రీ ఒక సెట్ నుంచి మరో సెట్‌కు చక్కర్లు కొడుతుందని సినీ సర్కిల్స్ టాక్. ఇక లెనిన్ సినిమాలో ఆమె పాత్ర ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version