నాగ చైతన్య, సునీల్ కలిసి నటిస్తున్న ‘తడాఖా’ సినిమాను నిర్మిస్తున్న బెల్లంకొండ సురేష్ ఆ సినిమా ఆడియో లాంచ్ లో నాగ్ అభిమానులకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. “ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది. కాని పక్షంలో నా ఆఫీసుకు వచ్చి నాతో గొడవపెట్టుకోవచ్చని “చెప్పాడు
బెల్లంకొండ తన భావోద్వేగాలను ఈ వేడుకలో కనబరిచాడు. కానీ తన కల నిజమవుతుందా?? ఈ సినిమా ‘వెట్టాయ్’ అనే తమిళ సినిమాకు రీమేక్. అక్కడ సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇక్కడ కుడా బాగా ఆడటానికి ఆస్కారమైన కధ దీనికి వుంది.
ఈ సినిమా విడుదల తేదిని నిర్మాత తెలుపలేదు. ఆ నిర్ణయం నాగార్జున చేతిలో వుంది. “నాగార్జునగారి ఇష్టం మేరకు సినిమా రీలీజ్ డేట్ ఉంటుంది. విడుదల తేదీని ఆయనే ప్రకటించాలని “తెలిపారు