కెరీర్ మొదటి సినిమా నుంచి అందాల ఆరబోతతో హాట్ బ్యూటీ గా పేరు తెచ్చుకున్న శ్రద్దా దాస్ తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం అని తేడా లేకుండా అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోగా, వై.వి.ఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రేయ్’ సినిమాలో శ్రద్దా దాస్ అమెరికన్ పాప్ సింగర్ గా కనిపించనుంది.
ఈమెని మీ డ్రీం రోల్ ఏమిటి? మీకు ఏ హీరో తో నటించాలని ఉంది? అని ప్రశ్నిస్తే ఈ హాట్ బ్యూటీ సమాధానమిస్తూ ‘ నాకు యాక్షన్ ఫిలిం చెయ్యాలంటే చాలా ఇష్టం, నాకు మార్షల్ ఆర్ట్స్ కూడా వచ్చు. అలాగే ‘బ్లాక్’ సినిమాలో రాణీ ముఖర్జీ లాంటి ఒక అసాధారణమైన పాత్ర చెయ్యాలి. ఇక హీరో విషయానికొస్తే నాకు సల్మాన్ ఖాన్ అంటే చాలా ఇష్టం, నేను చనిపోయేలోగా ఒక్కసారైనా అతనితో కలిసి నటించాలి. ఒక వేల అలా కుదరలేదు అంటే ఒక్కసారైనా అతని బుగ్గ మీద ముద్దు పెట్టుకోవాలని’ ఉందని తన మనసులోని మాటని బయట పెట్టింది. ఈ హాట్ బ్యూటీ కోరిక నెరవేరాలని కోరుకుందాం.