ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న బంగారు కోడిపెట్ట ప్రచారం

bangarukodipeta
నవదీప్ మరియు స్వాతి ప్రధాన పాత్రలలో రానున్న చిత్రం “బంగారు కోడి పెట్ట”. ఈ చిత్రం అంతర్జాలంలో పలువురిని ఆకర్షిస్తుంది. వినూత్నమయిన పబ్లిసిటీ తో ఈ చిత్ర బృందం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం గురించి పదే పదే చెప్పడం కాకుండా ఈ చిత్రంలో పాత్రలను ప్రేక్షకులకు చేరువయ్యేలా ఈ చిత్ర బృందం చేస్తున్నారు. ఆయా పాత్రలకు సంబందించిన కొన్ని డైలాగ్స్ తో సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారు. ఈ చిత్ర పురోగతిని కూడా ఇలానే చెబుతుండటం ఆసక్తికరమయిన విషయం.స్వాతి ఈ చిత్రంలో భాను అనే పాత్రలో కనిపించనున్నారు. భాను ధనవంతురాలు అవ్వడానికి ఎటువంటి రిస్క్ అయిన తీసుకోడానికి సిద్దం అవుతుంది. కోలా కంపెనీ లో పని చేసే భానుకి ఈ విషయంలో వంశీ సహాయపడతాడు ఈ పాత్రను నవదీప్ పోషిస్తున్నారు. రాజ్ పిప్పల్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సునీత తాటి గురు ఫిల్మ్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. మహేష్ శంకర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది.

Exit mobile version