సెన్సార్ పూర్తిచేసుకున్న బంగారు కోడిపెట్ట

సెన్సార్ పూర్తిచేసుకున్న బంగారు కోడిపెట్ట

Published on Nov 26, 2013 10:46 PM IST

Bangaru-Kodi-Petta-Movie-La
నవదీప్, స్వాతి జంటగా నటిస్తున్న ‘బంగారుకోడిపెట్ట’ సినిమా చాలా కాలం తరువాత విడుదలకానుంది. జూలై లో ఆడియో ను విడుదల చేసుకున్న ఈ సినిమా ఎప్పుడో విడుదలకావాల్సివుంది. దాదాపు ఐదు నెలల తరువాత ఈ సినిమా సెన్సార్ ముగించుకుని ‘యు/ఏ’ ను సంపాదించుకుంది

ఈ సినిమాకు పిప్పాల దర్శకుడు. సమాంతరంగా సాగే 3కధలను ఒకే తాటిపైకి తీసుకువచ్చే నేపధ్యం వున్న సినిమా. తన కలలని నిజం చేసుకోవడానికి ఏమైనా చేసే యువకుడి రూపంలో నవదీప్ కనిపిస్తాడు. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ లు ముఖ్య పాత్రలు పోషించారు. ‘గోల్కొండ హై స్కూల్’ లో కనిపించిన సంతోష్ మరో ముఖ్యపాత్రధారి

మణిశంకర్ సంగీత దర్శకుడు. సాహిర్ రాజా సినిమాటోగ్రాఫర్. ఈ సినిమా విడుదల తేది త్వరలో తెలపనున్నారు.

తాజా వార్తలు